జియో బంపర్ ఆఫర్... 100 జిబి ఫ్రీ-రూ.2200 క్యాష్ బ్యాక్

JioFi
Last Modified శనివారం, 23 మార్చి 2019 (19:03 IST)
జియో కూడా వరుస ఆఫర్లతో తనకు పోటీగా నిలిచిన టెలికం కంపెనీలకు దిమ్మతిరిగేలా చేస్తోంది. తాజాగా జియో ప్రకటించిన ఆఫర్ అలాగే వుంది మరి. ఇంతకీ డిటైల్స్ ఏంటంటే... క్జియామీ రెడ్మీ బ్రాండ్ స్మార్ట్ ఫోనును ఎవరైతే కొనులు చేస్తారో వారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది.

రెడ్మీ యూజర్లు జియో కనెక్షన్ తీసుకుంటే వారికి అదనంగా 100 జిబి అదనపు ఉచిత డేటాతో పాటుగా రూ. 2200 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఐతే ఈ ఆఫర్ ఎవరైతే రూ. 198 లేదా రూ. 299 ప్యాక్ వేసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది. ఐతే ఈ 100 జిబి డేటాను ఒకేసారి పొందేందుకు వీలులేదు. 10జిబి కూపన్లను ప్రతిసారి రీచార్జ్ చేసుకునేటపుడు ఇస్తారు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక రూ. 2200 క్యాష్ బ్యాక్‌కి 44 డిస్కౌంట్ కూపన్లు ఇస్తారు. దీని విలువ ఒక్కోటి రూ. 50. అదీ సంగతి.దీనిపై మరింత చదవండి :