మార్చి 17 వరకూ జియో 2జిబి ఫ్రీ... ఎలాగో తెలుసా?

JioFi
Last Modified శనివారం, 16 మార్చి 2019 (16:52 IST)
జియో మరోసారి సెలబ్రేషన్ ప్యాక్ అంటూ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం యూజర్లు మార్చి 17 వరకూ 2జిబి వంతున ఉచితంగా డేటాను పొందవచ్చు. జియో సెలబ్రేషన్ ప్యాక్‌ను జియో ప్రైమ్ యూజర్లకు అందుబాటులో వుంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌తో డేటా మాత్రమే యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.

ఇందుకుగాను యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి, మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ వుంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు ఈ ఉచిత డేటా... రోజుకి 2 జిబి అందుబాటులోకి వస్తుంది.దీనిపై మరింత చదవండి :