బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:00 IST)

లోకల్ కిరాణా స్టోర్లతో టైఅప్.. ఫ్లిఫ్‌కార్ట్ కస్టమర్ టచ్ ఏర్పాటు

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిఫ్‌కార్ట్ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి డెలీవరీ మోడల్‌ను ఏర్పాటు చేసింది. ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ తన కస్టమర్లకు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం లోకల్ స్టోర్లతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకుంటోంది. కొన్ని ప్రొడక్ట్‌‌లకు కస్టమర్లు టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను కోరుకుంటున్నారని ఫ్లిప్‌‌కార్ట్ పేర్కొంది. 
 
వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌‌కార్ట్‌ లోకల్ కిరాణా స్టోర్లతో కలిసి డెలివరీ మోడల్‌‌ను ఏర్పాటు చేసింది. 700 నగరాల్లో 27000 స్టోర్లతో టైఅప్ అయింది. దీని కోసం స్టోర్లలో అధికారిక ''బై జోన్స్'' ఏర్పాటు చేస్తోంది. కస్టమర్లు స్టోర్లకు వెళ్లి ప్రొడక్ట్‌‌ను చెక్ చేసుకుని, దాన్ని ఆన్‌‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. 
 
హైదరాబాదులో మాప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. లోకల్ స్టోర్లతో కలిసి మొబైల్స్ టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌‌పీరియెన్స్ అందించామని తెలిపారు. ఆర్డర్‌‌‌‌ ఆన్‌‌లైన్‌‌లో స్వీకరించామని ఫ్లిప్‌‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజ్‌‌నీష్ కుమార్ చెప్పారు.