సంబంధిత వార్తలు
- బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత : మహిళల టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు!
- ప్రపంచ దోమల దినోత్సవం- మలేరియా, డెంగ్యూ, జికా వైరస్లకు బైబై.. ఎలా?
- తంగలాన్ మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది - హీరో చియాన్ విక్రమ్
- యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 8వ ప్రదేశంగా అల్-ఫా ఆర్కియాలజికల్ ఏరియా
- ఆ తరహా గన్ ప్రపంచంలోని మరే దేశంలో లేదు : రక్షణ శాస్త్రవేత్త సతీశ్ రెడ్డి
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం లభ్యం!
ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌వానా ఒకటి. ఈ బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని గుర్తించినట్టు తెలిపింది.
దక్షిణాఫ్రికాలో 1905లో వెలికి తీసిన 3106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. అయితే, తాజాగా లభ్యమైన ఈ వజ్రం రెండో అతిపెద్ద పెద్దతిగా నిలిచినట్టు లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. అయితే, ఈ వజ్రం విలువ, నాణ్య, విషయాలను మాత్రం ఆ సంస్థ బహిర్గతం చేయలేదు. అసాధారణమైన ఈ వజ్రం లభ్యంకావడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని లూకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు.
తర్వాతి కథనం
