గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (14:14 IST)

ఆ తరహా గన్ ప్రపంచంలోని మరే దేశంలో లేదు : రక్షణ శాస్త్రవేత్త సతీశ్ రెడ్డి

satish reddy
భారత్ రక్షణ శాఖ తయారు చేసిన 155 ఎంఎం గన్ ప్రపంచలోని మరే దేశంలో లేదని భారత రక్షణ  శాస్త్రవేత్త జి.సతీశ్ రెడ్డి అన్నారు. పైగా, భారత రక్షణ శాఖ పూర్తి స్వాలంభన సాధించని ఆయన వ్యాఖ్యానించారు. భారత రక్షణ రంగ ఎగుమతులు త్వరలోనే రూ.80 వేల కోట్ల స్థాయికి చేరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సతీశ్ రెడ్డి .. రక్షణ పరిశోధన రంగంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ పరిశోధన రంగంలో భారతదేశం పూర్తి స్వావలంబన సాధించిందనీ, ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఎదుగుతోందన్నారు. భారత్ తయారు చేసిన 155 ఎంఎం గన్ ప్రపంచంలో మరే దేశం వద్ద ఇప్పటికీ లేదన్నారు. భారత దేశం రక్షణ రంగ ఎగుమతుల్లో త్వరలో రూ.50 వేల కోట్ల నుండి రూ.80 వేల కోట్ల స్థాయికి ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఏర్పాటు చేసిన బెల్ కంపెనీ ద్వారా త్వరలో ప్రపంచానికి ఎగుమతులు ఉంటాయన్నారు. నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలోని క్షిపణి కేంద్ర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. బెల్ కంపెనీ, నాగాయలంకలో ఏర్పాటు చేస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. కాగా, భారత రక్షణ శాస్త్రవేత్తగా పని చేస్తున్న సతీశ్ రెడ్డి .. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న విషయం తెల్సిందే.