1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Did this snake commit SUICIDE? Brown tree snake was found dead still biting its neck

అరెరె.. ఆస్ట్రేలియాలో పాము ఆత్మహత్య చేసుకుందట..

అయ్యో పాపం ఆస్ట్రేలియాలో పాము ఆత్మహత్యకు పాల్పడిందట. ఇంతకీ ఆ పాముకు ఏం కష్టమొచ్చిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవండి. స్నేక్ హంటర్ ఆ పామును పట్టుకోగానే ఆ పాముకు కోపం వచ్చింది. అంతేకాకుండా తనను

snake
అయ్యో పాపం ఆస్ట్రేలియాలో పాము ఆత్మహత్యకు పాల్పడిందట. ఇంతకీ ఆ పాముకు ఏం కష్టమొచ్చిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవండి. స్నేక్ హంటర్ ఆ పామును పట్టుకోగానే ఆ పాముకు కోపం వచ్చింది. అంతేకాకుండా తనను పట్టుకున్న స్నేక్ హంటర్ ఏం చేస్తాడో ఏమోనని పాము ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను స్నేక్ హంటర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో ట్రీ బ్రౌన్ అనే పేరు కలిగిన సర్పం విషపూరితమైంది. ఇది కాటేసిన నిమిషాల్లో ఎలాంటి వ్యక్తైనా ప్రాణాలు కోల్పోవాల్సిందే. అలాంటి పాము తన ఇంట్లో వుందని ఓ మహిళ ఫోన్ చేసింది. ఆస్ట్రేలియాలోని కేథరిన్ పట్టణంలో ఉంటున్న స్నేక్ హంటర్ మహిళ ఫోన్ చేసిన ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో 1.5 మీటర్ల ట్రీ  బ్రౌన్ సర్పం వుండటాన్ని గమనించాడు. 
 
దానిని మెంట్ హెగెన్ పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే, ఆ పాము తనంతట తాను తన మెడపై కాటు వేసుకుంది. దీంతో బ్రౌన్ సర్పపు విషమే ఆ పామును చంపేసింది. దీన్ని చూసిన స్నేక్ హంటర్ షాక్ అయ్యాడు. మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం విన్నానే కానీ.. పాములు ఆత్మహత్య చేసుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని హంటర్ చెప్పుకొచ్చాడు.
About Writer
selvi
తర్వాతి కథనం
డొనాల్ట్ ట్రంప్ నోట డెస్పాసిటో పాట.. వీడియో చూడండి..