సంబంధిత వార్తలు
- లంచం కేసులో అరెస్టు అయ్యానన్న ఆవేదనతో చితి పేర్చుకునీ...
- 17 అంతస్తుల భవనం నుంచి దూకేందుకు సిద్ధమైన బాలిక... కాపాడిన ప్రిన్సిపాల్ (Video)
- నీట్ దెబ్బకు విద్యార్థిని సూసైడ్.. రజనీకాంత్ విచారం..
- బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్: ఆత్మహత్యలకు పురిగొల్పిన అడ్మిన్ అరెస్ట్..
- భర్తకు వేరొక మహిళతో అక్రమ సంబంధం.. పెళ్లైన 4 నెలల్లో ఆత్మహత్య.. పుట్టింటికి వచ్చి?
కుటుంబం ఉసురు తీసిన ఆర్థిక కష్టాలు.. ఆరుగురి ఆత్మహత్య
ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
ఆర్థిక కష్టాలు ఓ కుటుంబం ఉసురు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఈ విషాదం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
సూర్యాపేట పట్టణంలోని స్థానిక కస్తూరీ బజార్‌లో నివసించే కస్తూరి జనార్దన్ (59) అనే వ్యక్తి కుటుంబం గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కష్టాలు తీరే మార్గం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. వారు కూడా ఆయనతో పాటు బలవన్మరణానికి పాల్పడేందుకు సమ్మతించారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు కలిసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను జనార్దన్, చంద్రకళ (50), ప్రభాత (30), అశోక్ (25), సిరి (5), రుత్విక (2)లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటివరకు తమ మధ్య ఉన్న వారు తెల్లారేసరికి విగత జీవులుగా మారడం చూసి పట్టణవాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
