గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:03 IST)

లంచం కేసులో అరెస్టు అయ్యానన్న ఆవేదనతో చితి పేర్చుకునీ...

ఓ అసిస్టెంట్ ఇంజనీర్ మంటల్లో సజీవదహనమ్యాయడు. అదీ కూడా చితి పేర్చుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి కారణం.. లంచం కేసులో అరెస్టు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయాడు.

ఓ అసిస్టెంట్ ఇంజనీర్ మంటల్లో సజీవదహనమ్యాయడు. అదీ కూడా చితి పేర్చుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి కారణం.. లంచం కేసులో అరెస్టు కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయాడు. ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా చింతామణి తాలూకా వంగామాల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వంగామాల గ్రామానికి చెందిన శ్రీనాథ్‌ రెడ్డి (27) బాగేపల్లి తాలూకాలో ఉపాధి హామీ పథకంలో సహాయక ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. యేడాది కిందటే ఉద్యోగంలో చేరాడు. ఆరునెలల క్రితం ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడి జైలు పాలయ్యాడు. 
 
ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనాథ్‌ ఎవరితోనూ కలవకుండా మథనపడుతూ ఉండేవాడు. తాను చేయని తప్పునకు బలయ్యానని ఆవేదన చెందుతూ వచ్చాడు. జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకులేకపోయిన శ్రీనాథ్‌ మంగళవారం అర్థరాత్రి అందరూ పడుకున్నాక, ఇంటి సమీపంలో కట్టెలకుప్ప పేర్చి దానిపై పడుకొని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పటించుకొని సజీవ దహనమయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.