బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:44 IST)

తితిదే మెట్ల మార్గంలో కొండచిలువ.. పరుగులు పెట్టిన భక్తులు

తిరుమల తిరుపతి శ్రీవారిని చేరుకునే మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కనిపించింది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ కొండ చిలువ పొడవు 15 అడుగుల వరకు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చె

తిరుమల తిరుపతి శ్రీవారిని చేరుకునే మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కనిపించింది. దీన్ని చూసిన శ్రీవారి భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ కొండ చిలువ పొడవు 15 అడుగుల వరకు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ కొండ చిలువ 3,300 మెట్ల దగ్గర కనిపించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... తిరుమలలో సోమవారం వర్షం కురిసింది. శ్రీవారి కనుమల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో అడవిలోని ఏమూల నుంచి వచ్చిందో కానీ... సుమారు 15 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ తిరుమలలో శ్రీవారిని సమీపించే 3,300 మెట్ల దగ్గరకు నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది. 
 
మట్టి తిందో లేక ఇంకేదైనా తిందో కానీ కదలలేక కదులుతూ మెట్ల మార్గంలో వెళ్లే భక్తులను భయపెట్టింది. దీంతో పలువురు యువకులు కొండచిలువ ఫోటోలు, వీడియో తీసి తిరుమల అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి, దానిని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లారు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.