శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ ఎలా పేలుతుందో చూడండి.. పొగలు కక్కుతూ.. (వీడియో)
శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ పేలడమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోన్ వాడకాన్ని ఆపేయాలని, కొత్త ఫోన్ తీసుకున్నా.. స్విచ్ఛాఫ్ చేయండంటూ శామ్ సంగ్ యాజమాన్యమే ప్రకటించిన నేపథ్యంలో.. దక్షిణ కొరియా రాజధాని
శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ పేలడమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోన్ వాడకాన్ని ఆపేయాలని, కొత్త ఫోన్ తీసుకున్నా.. స్విచ్ఛాఫ్ చేయండంటూ శామ్ సంగ్ యాజమాన్యమే ప్రకటించిన నేపథ్యంలో.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలింది. పొగలు కక్కుతున్న ఆ ఫోన్‌ను ఎవరో వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూట్యూబ్‌లో ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది.
కాగా, శామ్‌సంగ్ నోట్ 7 బ్యాటరీలు హీటింగ్ ప్రాబ్లమ్‌తో పేలుతున్న ఘటనలు ఇప్పటికే చాలా చోట్ల జరిగాయి. ఈ ఫోన్ కొనే వారు ఫిర్యాదు చేయడంతో శామ్‌సంగ్ కంపెనీ స్పందించింది. తయారీ లోపాలున్నట్లు గుర్తించిన కంపెనీ రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఎవరి డబ్బు వారికి ఇచ్చేసి... ఈ మోడల్ తయారీని నిలిపివేయాలని స్యామ్‌సంగ్ భావిస్తోంది.
అమెరికాలో మొబైల్ ఫోన్ల వ్యాపారంలో రెండో స్థానంలో ఉన్న ఏటీఅండ్ టీ సంస్థ, మూడో స్థానంలో ఉన్న టి-మొబైల్ కూడా తాము శాంసంగ్ నోట్ 7 ఫోన్లను ఎక్స్చేంజి చేయడం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వీడియో చూడండి.
