జర్నలిస్టుపై పాక్ కన్నెర్ర.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధం.. ట్విట్టర్లో ఆల్మయిడా ఏమన్నారు..?
పాకిస్థాన్ మీడియాపై నియంతృత్వ పోకడ మరోసారి బయటపడింది. పాక్ సర్కారుకు, సైనిక నాయకత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు డాన్ పత్రికలో కథనం రాసిన జర్నలిస్టుపై కన్నెర్ర చేసింది. దేశం వెడిచి వెళ్లొద్దంట
పాకిస్థాన్ మీడియాపై నియంతృత్వ పోకడ మరోసారి బయటపడింది. పాక్ సర్కారుకు, సైనిక నాయకత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు డాన్ పత్రికలో కథనం రాసిన జర్నలిస్టుపై కన్నెర్ర చేసింది. దేశం వెడిచి వెళ్లొద్దంటూ హుకుం జారీ చేస్తూ అతనిపై నిషేధం విధించింది.
ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం వల్లే పాక్ ప్రపంచంలో ఒంటరి అయిందంటూ సైనిక నాయకత్వానికి పౌర ప్రభుత్వం తెగేసి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ ఈనెల 6న డాన్ జర్నలిస్టు సిరిల్ అల్మయిడా ఓ కథనం రాశారు. పత్రిక మొదటి పేజీలో ఆ కథనం ప్రచురితమైంది. ఈ వార్తలను పాకిస్థాన్ సర్కారు ఖండించింది. ఇలాంటి కట్టుకథలు అల్లిన వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రధాని నవాజ్ షరీప్ సోమవారంనాడు అధికారులను ఆదేశించింది.
'డాన్' పత్రికలో వచ్చిన వార్తకు సంబంధించి తనపై పరిమితులు విధించడంపై అల్మయిడా ట్విట్టర్‌లో స్పందించారు. ఇది విచారకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. తనకు దేశం విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశమే లేదని, ఇది తన సొంతగడ్డ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

