వర్క్ ప్లేస్ కొలాబరేషన్‌కు.. ఫేస్ బుక్ నుంచి మొబైల్ బిజినెస్ యాప్..
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాజాగా మొబైల్, బిజినెస్ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫేస్ బుక్ ఎట్ వర్క్ అనే పేరుతో లాంచ్ చేసిన సర్వీసును వర్క్ ప్లేస్ పేరుతో ఇక అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తాజాగా మొబైల్, బిజినెస్ యాప్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫేస్ బుక్ ఎట్ వర్క్ అనే పేరుతో లాంచ్ చేసిన సర్వీసును వర్క్ ప్లేస్ పేరుతో ఇక అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని వ్యాపార వర్గాల వారందరూ వినియోగించుకోవచ్చునని మంగళవారం ప్రకటించింది. ప్రకటనల ఆధారిత వర్క్ ప్లేస్ యాప్ కోసం వినియోగదారుడు ఒక డాలర్ నుంచి 3 డాలర్లు చెల్లించాలి. దీనిసహాయంతో రియల్ టైంలో ప్రపంచవ్యాప్తంగా సహోద్యోగితో చాట్ చేయవచ్చునని ఫేస్ బుక్ వెల్లడించింది.
ఇంటర్నెట్ మెయిల్స్, న్యూస్ లెటర్స్ పాత టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా తమ యాప్ పనిచేస్తుందని ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ గ్లోబల్ హెడ్ జూలియన్ కోడోర్ నియో చెప్పారు. దీనిద్వారా తోటి ఉద్యోగులతో కలిసి సమర్థవంతంగా పనిచేసుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు.
ఈ యాప్‌ను ఐదు దేశాలలో భారతదేశం, అమెరికా, నార్వే, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ లలో వాడుతున్నారని పేర్కొంది. వర్క్ ప్లేస్ యాప్ అన్ని కార్పొరేట్లకు, సంస్థలకు అందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. సంవత్సరకాలంగా ప్రయోగ దశలో ఉన్న ఈ యాప్ ను ఇపుడు అన్ని వ్యాపార వర్గాల వారికోసం అధికారికంగా లాంచ్ చేసింది. అయితే దీనికి సబ్ స్క్రిప్లన్ చెల్లించాల్సి ఉంటుంది.

