1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Software engineer among two arrested for spreading rumours about Jayalalithaa's health

జయలలిత ఆరోగ్యంగా సరిగ్గా లేదని దుష్ప్రచారం.. టెక్కీల అరెస్ట్.. వైకో పరామర్శ..

తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఇద్దరు సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జయలలిత ఆరోగ్యం సరిగ్గా లే

Software engineer
తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యంపై దుష్ప్రచారం చేసిన వ్యక్తుల్లో ఇద్దరు సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జయలలిత ఆరోగ్యం సరిగ్గా లేదని ఓ వెబ్ సైట్ ద్వారా అపోలో ఆస్పత్రిలో ఉద్యోగి చెప్పినట్లుగా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించి సతీశ్ కుమార్ (26), మదాసమి(25) అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిలో సతీశ్ కుమార్ ఎంసీఏ చదివాడు.
 
ప్రస్తుతం ఓ ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మదాసమి కూడా వాలచెరీలోని ఓ ప్రైవేట్ సంస్థలో టెక్నీషియన్ పని చేస్తున్నాడు. 'టెక్నీషియన్ వెబ్‌సైట్‌లో అపోలో ఆస్పత్రి ఉద్యోగి చెప్పినట్లుగా ఉన్న ఆడియోను వెబ్ సైట్‌లో నమోదు చేశాడు. ఐటీ ఇంజినీర్ ఫేస్‌బుక్‌లో జయ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేశాడు. వీరిద్దరు కూడా ప్రజలు భయపడేంత స్థాయిలో ఆడియో క్లిప్పింగులు, సందేశాలు పెట్టారు' అని పోలీసులు వివరించారు.
 
ఇదిలా ఉంటే, తీవ్ర అనారోగ్యానికి గురై గత 15 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరలోనే మంచి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని ఎండీఎంకే నేత వైకో ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బాగున్నారని.. అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. మంచి ఆరోగ్యంతో ఆమె ఇంటికి చేరబోతున్నారని.. త్వరలోనే అన్నాడీఎంకే కార్యకర్తల ఆందోళన దూరమవుతుందని పేర్కొన్నారు.
తర్వాతి కథనం
పేషెంట్‌ను చంపేయన్న సీనియర్ డాక్టర్.. జూనియర్ అదే పనిచేశాడు..