చావంటే భయంలేదు.. ఫ్లైట్‌ను కూల్చివేయాలన్నదే ప్లాన్ : ఫ్లైదుబాయ్ కో కెప్టెన్ వాంగ్మూలం
తనకు చావంటే భయం లేదనీ, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయాలన్న కుట్రతోనే కెప్టెన్ స్మిత్ మచ్చర్ దృష్టిమళ్లించి దాడి చేసినట్టు ఆ విమానం కో-పైలెట్ హమామ్ అల్ హమామీ చెప్పారు. ఈ మేరకు విచారణ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఫ్లైదుబాయ్ విమానం హైజాక్ యత్నం కేసులో కోపైలెట్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించానని అంగీకరించాడు. చావంటే తనకు ఏమాత్రం భయం లేదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశాడు.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళుతున్న ఎఫ్‌జెడ్ 1073 విమానంలో పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి, ఆ తర్వాత తన పథకం ప్రకారం దాడికి పాల్పడినట్టు హమామ్ అంగీకరించాడు. ప్రార్థన చేసుకుంటానని చెప్ప కెప్టెన్ దృష్టి మరల్చి, విమానంలో గొడ్డలితో దాడికి యత్నించినట్టు తెలిపాడు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ - సౌదీ అరేబియా దర్యాప్తు బృందాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో గానీ, ఇరాన్‌తోగానీ ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. హమామ్ యూఏఈలో జన్మించాడు. ఆయన తండ్రి ఒమన్‌కు, తల్లి సిరియా దేశానికి చెందినవారు. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు హమామ్ ఒమన్, సిరియా, మొరాకోలలో నివసించాడు.
సిరియాలో ఎక్కువ కాలం జీవించినందున అక్కడి సుధీర్ఘ అంతర్యుద్ధం సమయంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతని సోషల్ మీడియా ఖాతాల్లో వేలకొద్దీ ఉగ్రవాద సంబంధిత పోస్టులు, సందేశాలను అధికారులు గుర్తించారు. అయితే, ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయాన్ని మాత్రం అతను ఇంకా వెల్లడించేదు. ఈ కేసులో దర్యాప్తు లోతుగా సాగుతోంది.
