భారత్ రైల్వే నెట్‌వర్క్ చాలా అధ్వాన్నం.. తక్షణం అప్‌గ్రేడ్ చేయాలి : చైనా మీడియా
భారత రైల్వే నెట్‌వర్క్‌పై పొరుగు దేశం చైనా స్పందించింది. భారతదేశంలో ఉన్న రైల్ నెట్‌వర్క్ చాలా అధ్వాన్నంగా ఉందనీ, దీన్ని తక్షణం అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
భారత రైల్వే నెట్‌వర్క్‌పై పొరుగు దేశం చైనా స్పందించింది. భారతదేశంలో ఉన్న రైల్ నెట్‌వర్క్ చాలా అధ్వాన్నంగా ఉందనీ, దీన్ని తక్షణం అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 140 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఓ సలహా కూడా ఇచ్చింది. భారత్ అర్జెంటుగా తన రైల్వేను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అందుకు చైనా పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొంది.
భారత్ రైల్వే నెట్‌వర్క్ చాలా అధ్వానంగా ఉందని, భారత్ వీలైనంత త్వరగా రైల్వేలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, అందుకు కావాల్సిన సాయం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార వార్తా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఓ కథనంలో పేర్కొంది.
అలాగే, "ఇండోర్-పట్నా రైలు ప్రమాదం నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై ఇండియా-చైనా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు చైనా నేరుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది" అని గ్లోబల్ టైమ్స్ అభిప్రాయపడింది.
