1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Joe Biden says Omicron lockdowns not needed for now

ఒమిక్రాన్ వేరియంట్ భయం : లాక్డౌన్‌పై జో బైడెన్ కామెంట్స్!

Joe Biden
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది. ఈ వైరస్ తమతమ దేశాల్లోకి వ్యాపించకుండా ఆయా దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం కూడా ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. అయితే, లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 
 
ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునివుంటే, మాస్కులు ధరిస్తే లాక్డౌన్ అవసరం రాదని ఆయన స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
అయితే, ప్రస్తుతం అమెరికాలో ఒక ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో 8 ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికుల రాకపోకలపై అమెరికా ఆంక్షలు విధించింది. అదేసమయంలో గత యేడాదితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పొచ్చు. 
తర్వాతి కథనం
నెల్లూరులో మ‌హాపాద యాత్ర‌కు బ్రేక్! రాజధాని రైతులకు సోమిరెడ్డి పలకరింపు