1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (20:14 IST)

ఒమైక్రాన్‌ రూపంలో.. థర్డ్ వేవ్ ముప్పు వస్తోందా?

ఒమైక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ వచ్చేసిందని టాక్ వస్తోంది. అలాగే డెల్టాను మించిన వేరియంట్‌ వస్తేనే దేశంలో థర్డ్‌ వేవ్‌ ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు హెచ్చరించారు. ఒమైక్రాన్‌ రూపంలో అలాంటిది వచ్చిందనే ఆందోళన కనిపిస్తోంది. 
 
గత పరిస్థితులను బేరీజు వేసి ఒమైక్రాన్‌ ప్రభావం మనపైనా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 11న ఒమైక్రాన్‌ను గుర్తించారు. 15 రోజుల వ్యవధిలోనే.. చాలా ప్రమాదకారి రకంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 
 
కొవిడ్‌ వేరియంట్‌లలో దేన్నీ ఇంత తక్కువ కాలంలో అలా పేర్కొనలేదు. కేవలం వారం వ్యవధిలో ఒమైక్రాన్‌ వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది.  కాబట్టే.. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
 
దేశంలో సెకండ్‌ వేవ్‌లో డెల్టా కారణంగానే 2.5 కోట్ల కేసులు నమోదై, 2 లక్షలపైగా మరణాలు సంభవించాయి. ఒమైక్రాన్‌ వ్యాపిస్తే ముప్పు మరింత ఎక్కువని ఆందోళన వ్యక్తమవుతోంది.
 
డబ్ల్యూహెచ్‌వో అత్యవసర సమావేశం, విమాన సర్వీసులపై దేశాలు ఆంక్షలు విధిస్తుండడం బట్టి పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసిపోతోంది.