మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (14:53 IST)

ఒమిక్రాన్ భయపెడుతోంది.. వ్యాక్సిన్లు వేయించుకోండి.. డాక్టర్ ఫౌసీ

కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న ఒమిక్రాన్ (బి.1.1.529) శరవేదంగా వ్యాపిస్తోందని, అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఫౌసీ అమెరికా ప్రజలను కోరారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోనివారు ఈ టీకాలు వేయించుకోవాలని, రెండో డోసుల వ్యాక్సిన్ పూర్తయినవారు వీలుంటే బూస్టర్ డోస్ వేసుకోవాలని ఆయన కోరారు. 
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇపుడు ప్రపంచంలోని పలు దేశాల్లో వెలుగు చూస్తోంది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి విమానల సర్వీసులతో పాటు.. ప్రజల ప్రయాణాలపై కూడా అనేక దేశాలు ఆంక్షలు విధిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఎనిమిది ఆఫ్రికా దేశాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తుంది.