శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (17:01 IST)

'ఒమిక్రాన్‌'పై కేంద్రం అలెర్ట్ - రాష్ట్రాలకు హెచ్చరికలు - లేఖ రాసిన కార్యదర్శి

ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బెంగుళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు ఒమిక్రాన్ వైరస్ (బి1.1.529) సోకినట్టు భావిస్తున్నారు. దీంతో వారిద్దరినీ ఐసోలేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. 
 
ముఖ్యంగా, ఇదే వేరియంట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించి, అన్ని విమానాశ్రయాల్లో గట్ట నిఘా పెట్టాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖరు రాశారు. దేశంలోకి కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించే అవకాశం ఉందని, అందువల్ల రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో కోరారు. ముఖ్యంగా, కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కోరారు. ఈ వైరస్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆయన తన లేఖలో సూచించారు.