శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

రేవ్ పార్టీలో హిజ్రాలు - యువకులు .. వారందరూ స్వలింగ సంపర్కులేనా?

వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ నగరంలో విపరీతంగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఈ పార్టీల్లో యువతీయువకులు మునిగితేలుతున్నారు. విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి పార్టీలపై సమాచారం అందుకునే పోలీసులు ఆకస్మిక సోదాలు చేస్తూ అనేక మందిని అరెస్టు చేస్తున్న సంఘటనలు అపుడపుడూ వెలుగు చూస్తున్నాయి. 
 
తాజాగా కూకట్ పల్లి వివేక్ నగర్‌లో ఓ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో రేవ్ పార్టీలో మునిగిపోయివున్న 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీ మొత్తంలో మద్యం బాటిళ్లతో పాటు కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
పోలీసులకు పట్టుబడిన యువకులు ప్రతి వారాంతంలో ఈ తరహా వీకెండ్ పార్టీల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడించారు. అయితే, పోలీసులకు చిక్కిన వారంతా హోమో సెక్సువల్‌ యువకులుగా అనుమానిస్తున్నారు. వీరందరిపై కేసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.