శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (11:11 IST)

గేయ రచయిత సిరివెన్నెల ఆరోగ్యం ఎలావుంది?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఉన్నట్టుండి అస్వస్థతకుగురైన ఆయన్ను శనివారం హుటాహుటన హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలో సిరివెన్నెల ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల ఆరోగ్యం బాగానే, నిలకడగానేవుందని చెప్పారు. ఆయన కుమారుడు యోగి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో సాహితీ అభిమానులతో పాటు.. సినీ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.