1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Enough global oil, no panic needed: Union Minister Hardeep Singh Puri on West Asia crisis

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

Hardeep Singh Puri
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో పలు ప్రపంచ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో భారత్‌తో సహా పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్‌తో సహా ఇతర ఇతర సహజవాయువుల కొరత ఏర్పడే అవకాశం ఉత్పన్నమైంది. ఈ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల దేశంలో చమురు కొరత ఏర్పడుతుందనే భయాలు అక్కర్లేదన్నారు. 
 
గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నానం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా మన సరఫరాలను వైవిధభరితం చేశాం. ప్రస్తుతం మనకు వచ్చే సరఫరాల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదు అని మంత్రి వివరించారు. 
 
కాగా, భారత్ తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి హానికరం. విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత బలహీనపడుతుంది. అయినప్పటికీ రష్యా, అమెరికాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా భారత్ తన చమురు వనరులను వైవిధ్యభరితం చేసుకుంది. 
తర్వాతి కథనం
దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?