బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (11:05 IST)

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్.కెకు ఛాతినొప్పి.. ఆస్పత్రిలో అడ్మిట్

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే, వైకాపా నేత ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి ఉన్నట్టుండి ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన నియోజకవర్గంలో శనివారం మంగళగిరి - తాడేపల్లి పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. రోజంతా పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీబిజీగా గడిపారు. నరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. 
 
సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఛాతనొప్పి రావడంతో చూపించేందుకు నగరంలోని సాయిభాస్కర ఆస్పత్రికెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు వివిధర రకాలైన వైద్య పరీక్షలు చేసి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అదేసమయంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలగడగా వుంది.