ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (15:14 IST)

గంగూలీకి ఛాతినొప్పి.. మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతినొప్పి వచ్చింది. దీంతో ఆయన మళ్లీ ఆస్పత్రిలో చేరారు. బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, గంగూలీ ఛాతీలో నొప్పితో బాధపడడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే ఆయనకు వ్యాయామం చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కోల్‌కతా ఉడ్‌లాండ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఆయనకు ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. 
 
అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని ఈ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సర్జరీ అనంతరం గంగూలీ కోలుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. ఆయన మరోసారి ఆసుపత్రిపాలవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. 
 
సౌరవ్ గంగూలీ గుండెకు ఏమైందన్న ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటికి మొన్న యాంజియోప్లాస్టీ చేయగా, ఇంతలోనే గుండె నొప్పి ఏంటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.