ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:11 IST)

పోస్ట్ కోవిడ్ సమస్యలు : ఆస్పత్రి పాలైన ముఖ్యమంత్రి!

కరోనా వైరస్ బారినపడిన అనేక మంది పోస్ట్ కోవిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్న తర్వా ఆయన పలు రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురికాగా శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు.
 
మరోవైపు ఆసుపత్రి నుంచి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల నిన్నటి నుంచి ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందన్నారు. ఎస్ఎంఎస్ ఆస్పత్రి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించబోతున్నారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని... త్వరలోనే ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు. మీ అందరి ఆశీర్వాదాలు తనతో ఉంటాయని అన్నారు.