శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (09:08 IST)

సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోని  ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురైన రోగులు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ ప్రమాదంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలతో పాటు.. పడకలు, ఫర్నిచర్ అగ్నికి అహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో... విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు గుర్తించారు.