శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (09:28 IST)

హీరోయిన్ రకల్ ప్రీత్ ఇంట్లో అగ్నిప్రమాదం.. అందరూ..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి ఆమె ఇంట్లోని సభ్యులందరూ సురక్షితంగా బయపటపడ్డారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ముంబైలో ఉంటున్నారు. ఆమె నివసించే భవనంలోని 12వ అంతస్తులో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం.
 
ఈ అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సభవించలేదు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్... ఆ తర్వాత అనేక స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇటీవల ఆమె నటించిన కొండపొలం చిత్రం విడుదలైంది. ఇందులో ఆమె డీగ్లామర్ రోల్‌లో కనిపించారు. 
 
ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు.. హిందీ చిత్రాల్లో కూడా బిజీ అయ్యారు. అలాగే, ముంబైలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కూడా ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరై వార్తల్లో నిలిచారు. అలాగే షూటింగ్ కోసం ఇపుడు విదేశాల్లో వుంది.