శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (10:39 IST)

రాజేంద్ర నగర్ శివారుల్లో భారీ అగ్నిప్రమాదం, కాటన్ బెడ్ల కంపెనీ కాలి బూడిదవుతోంది

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారుచేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలు క్రమంగా వ్యాపించి అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశ్రమలో కాటన్ వేస్ట్ వుండటంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 
 
దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది గంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.