శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (14:48 IST)

ఆయిల్ ట్యాంకర్ - ప్రైవేట్ బస్సు ఢీ - 8 మంది దుర్మరణం

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రమాదం స్థలంలో మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగాయపడ్డారు. 
 
ఈ ఘటన బుధవారం నాడు బార్మర్‌ - జోధ్‌పూర్‌ హైవేపై చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. 
 
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 10 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు బయటకు తీశారు. మిగిలిన ప్రయాణికుల ఆచూకీపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు 10 మందిని రక్షించారు. మిగిలిన ప్రయాణికుల గురించి ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ఈ భారీ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.