గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (15:06 IST)

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు టెక్కీల దుర్మరణం

జిల్లా కేంద్రమైన విశాఖపట్టణం పట్టణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ ఇద్దరు టెక్కీలు వెళ్తున్న‌ బైక్‌ను పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జ‌రిగి వారు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది.
 
మృతుల పేర్లు ధనరాజ్, కె.వినోద్ ఖన్నాగా పోలీసులు గుర్తించారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో ప‌నిచేస్తుండ‌గా, వినోద్ మ‌రో సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారిద్ద‌రు పనోరమ హిల్స్‌లో‌ ఉన్న స్నేహితుడిని కలిసి తిరిగి త‌మ ఇళ్ల‌కు బైకుపై వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని చెప్పారు. పోలీసుల కేసు నమోదు చేసి  విచారణ జరుపుతున్నారు.