సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 5 నవంబరు 2021 (14:54 IST)

డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే కి సీఎం జగన్‌కు ఆహ్వానం

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్ ఆహ్వనించారు. 

 
ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకి ఈఎన్‌సీ సీఐఎన్‌సీ వివరించారు. అంతేకాక ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

 
 సీఎం వైఎస్‌ జగన్‌ ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ వికాస్‌ గుప్తా, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి, ఫ్లాగ్‌ లెఫ్టినెంట్‌ శివమ్‌ కందారి పాల్గొన్నారు.