శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (10:15 IST)

సభ్యత ముఖ్యం.. ఏపీ సీఎంని బూతులు తిట్టడం సరికాదు.. కేటీఆర్ ఫైర్

da  ఏపీ ‘బూతు’ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం సరైన పద్ధతి కాదని అభిప్రాయడ్డారు. రాజకీయాల్లో అన్నిటికంటే సభ్యత ముఖ్యమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ ఆఫీసుల మీద దాడులు ఎవరు చేశారన్నది పక్కనబెడితే.. దానికి మూలం ఎక్కడుందన్నది ఆలోచించుకోవాలన్నారు. రాజకీయాల్లో అసహనం పనికిరాదన్నారు. 
 
రాజకీయాల్లో డిగ్నిటీ ఉండాలని, ఉద్యమ సమయంలో ఉద్వేగంతో మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు గానీ.. ఇప్పుడు బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. తెలంగాణలో కూడా కొందరు నేతలు సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
 
అధికారం అనేది ప్రజలు ఇస్తే వచ్చేదని, ప్రజల మనసు గెలుచుకుంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తదితర అంశాలపై శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ప్రజలు టీఆర్ఎస్‌ని 2009లో తిరస్కరిస్తే పోరాటం చేసి 2014లో అధికారంలోకి వచ్చామని కేటీఆర్ అన్నారు. 2019లో ఏపీలో టీడీపీ అధికారం కోల్పోగా.. తెలంగాణలో అంతర్ధానమైందని ఎద్దేవా చేశారు.