గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (12:24 IST)

అతివేగంగా హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా ఓ కారు హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతిని నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. 
 
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ నుంచి వచ్చిన ఓ వారు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం దెబ్బతినగా, అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికుల్లో ఒకరికి చేయి విరిగింది. ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, గాయపడిన వారిని సోమాజిగూడలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్, కార్తీక్‌గా గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే ఈ కారును కొనుగోలు చేశారు. వీరంతా కలిసి ఆఫ్జల్ గంజ్‌లో టిఫన్ చేయడానికి వెళుతూ ఈ ప్రమాదానికి లోనయ్యారు.