గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (10:19 IST)

ఎఫ్‌బీ ఫ్రెండ్‌తో ఎస్సై పరీక్షలకు వెళ్తే... కారులోనే ఎంత పనిచేశాడంటే?

దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. యూపీలో మధురలో ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తున్న యువతిపై ఓ యువకుడు కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. 21 ఏళ్ల బాధిత యువతికి ఫేస్‌బుక్ ద్వారా హర్యానాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ పరిచయమయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారింది. 
 
ఈ క్రమంలో ఎస్సై పరీక్ష రాసేందుకు అతనితో కలిసి వెళ్ళింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న తేజ్‌వీర్ తన డ్రైవర్‌తో కలిసి కారులో ఆగ్రా వెళ్లి ఆమె పరీక్ష రాస్తున్న సెంటర్ బయట కాపుకాశాడు.
 
పరీక్ష రాసి బయటకు వచ్చిన ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఆపై మత్తుమందు ఇచ్చి కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం స్పృహతప్పిన ఆమెను ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తేజ్‌వీర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.