శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 నవంబరు 2021 (23:03 IST)

4,00,000 అమ్మకాల మైలురాయిని దాటిన రెనో క్విడ్‌, హైదరాబాద్‌లో వేడుకలు

భారతదేశంలో 4-లక్షల సంచలన మైలురాయిని ఇటీవలే దాటిన రెనో క్విడ్‌, మినీ-కారు సెగ్మెంట్‌లో ప్రధాన శ్రేణిలో నిలుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ మైలురాయిని హైదరాబాద్‌లో – క్విడ్‌ యజమానులతో కలిసి  పీపీఎస్ రెనాల్ట్ మరియు ఆర్కా రెనాల్ట్ నిర్వహించిన రెనో క్విడ్‌ మైలేజీ ర్యాలీ ద్వారా రెనో జరుపుకుంది. మొత్తం 96 కి.మీ దూరం సాగిన ఈ ర్యాలీకి హోటల్ రాడిసన్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాదులో పచ్చజెండా ఊపారు.
 
 
 
ప్రస్తుత క్విడ్‌ కస్టమర్లు మ్యాగ్జిమం మైలేజీ పొందాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ ర్యాలీ నెహ్రూ రింగ్ రోడ్ వ్యాప్తంగా  నిర్వహించడం జరిగింది. ఈ వేడకకు అనూహ్యమైన స్పందన లభించింది. 25 కస్టమర్ల కంటే ఎక్కువ మంది ఇందులో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు వినియోగదారులు అసాధారణంగా 48.81 కెఎంపీఎల్ సరాసరి మైలేజీ నివేదించారు. . అద్భుతమైన డిజైన్‌, సృజనాత్మకతతో కూడిన గొప్ప మైలేజీతో పాటు అమూల్యమైన విలువను అందిస్తుందని క్విడ్‌ మరోసారి నిరూపించింది.

 
అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు, పనితీరును దృష్టిలో ఉంచుకొని భారతీయ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసి రూపొందించిన వాహనం రెనో క్విడ్‌. “మేక్‌ ఇన్‌ ఇండియా” పథకపు సిద్ధాంతాన్ని ఇది బలంగా ప్రతిధ్వనింపజేస్తుంది. భారతీయ అనుభవం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయంగా సమర్థవంతమైన ఉత్పత్తులను భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచానికి అందించేందుకు ఇది కృషి చేస్తుంది.
 
 
RXE, RXL, RXT, క్లైంబర్‌ వేరియంట్స్‌తో 0.8 లీటర్లు, 1.0 లీటర్ల SCe మ్యానువల్‌, AMT ఆప్షన్స్‌ పవర్‌ట్రెయిన్స్‌తో కూడిన 9 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉండే రెనో క్విడ్‌, భారతదేశంలో రెనో బ్రాండ్‌ ఎదుగుదలలో కీలకంగా నిలుస్తోంది. ఎస్‌యూవీ ప్రేరణతో రూపొందించిన డిజైన్‌, మొట్టమొదటిసారిగా 20.32 సెం.మీటర్ల టచ్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేతో కూడిన మీడియాన్యావ్‌, ఫ్లోర్‌ కన్సోల్‌ మౌంటెడ్‌ AMT డయల్‌ వంటవన్నీ డ్రైవింగ్‌ను శ్రమలేకుండా చేస్తున్నాయి.