గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (20:51 IST)

బికీనీతో ఫోజ్‌లేకాదు ఇలా మొక్క‌లను కాపాడానంటున్న‌ పూజీ హెగ్డే

Pooja Hegde
పూజా హెగ్డే గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో భాగంగా ఈరోజు మూడు మొక్క‌ల‌ను ఫిలింసిటీలోని ఓ షూటింగ్ నిమిత్తం వ‌చ్చిన ఆమె నాటింది. ఎం.పి. జోగిప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆమె పాల్గొంది. మొక్క‌ల‌కు వాటిని నీళ్ళు పోస్తూ ఇలా ఫోజ్ ఇచ్చి న‌టుడు అక్ష‌య్‌కుమార్‌కు ఛాలెంజ్ విసిరింది. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుదాం అంటూ కాప్ష‌న్ పెట్టింది. 
 
మ‌రోవైపు ఇటీవ‌లే మాల్దీవ్‌లోని స‌ముద్ర‌పు బీచ్‌ల త‌న అందాల‌ను చూపిస్తూ యువ‌త‌ను గిలిగింత‌లు కూడా పెడుతుంది. ఇది కేవ‌లం వ్యాయాయం కోసం మ‌న‌స్సు ప్ర‌శాంతత కోసం స‌ముద్రంలో ఈత కొడుతున్న‌ట్లు, సూర్య కాంతిలోని డీ విట‌మిన్ కోసం ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు బికినీతో వున్న ఫొటో  పెట్టింది. 
 
ఇప్ప‌టికే అల‌వైకుంఠ‌పురంలో పూజ అందాల‌కు యువ‌త ఫిదా అయిపోయారు. తాజాగా ప్ర‌భాస్‌తో రాథేశ్యామ్‌లో అల‌రించ‌బోతోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి క్రేజ్ వుంది.