1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (19:04 IST)

రాధే శ్యామ్ నా స్థాయిని పెంచుతుంది- గీత రచయిత కృష్ణకాంత్ (కె.కె)

Krishnakanth (KK)
రాధే శ్యామ్-  సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడు కుంటున్నారు. కొంతమంది పునర్జన్మల కథ అని,ఇంకొంతమంది టైం ట్రావెల్ అని, సై ఫై సినిమా అని, ట్రైన్ లో జరిగే  సినిమా అని ఇలా రకరకాలుగా ఊహించు కుంటున్నారు.ఈ కథ ఎంటనేది వారి ఊహలకే వదిలేద్దాం. ఇది 1970 లో యూరప్ జరిగే లవ్ స్టొరీ.అచ్చ తెలుగు పదాలు ఉండాలని రాయడం జరిగింది.- అని పాటల రచయిత కృష్ణకాంత్ (కె.కె) తెలియ‌జేస్తున్నారు.
 
 గేయ రచయిగా పదేళ్ల కాలంలో రెండు వందల సినిమాలకు పైగా పని చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు.తను రాసిన ఎన్నో పాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ప్రేక్షకుల మనుషును దోచుకున్నారు యువ గీత రచయిత కృష్ణకాంత్/ కెకె.
తాజాగా రెబ‌ల్ స్టార్ డా. యూ.వి. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర గేయ రచయిత కృష్ణ కాంత్ (కె.కె) మీడియాతో మాట్లాడారు.
 
- 2009 లో నా ఫ్రెండ్ శ్రవణ్ భరద్వాజ్ (ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్) తో కలసి"కలయో నిజమో" ఆల్బమ్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత హనురాఘవ పూడి గారు ఇచ్చిన ట్యూన్ కు పాటరాస్తే "అందాల రాక్షసి" లో రెండు పాటలు రాసే అవకాశము ఇవ్వడం జరిగింది.ఆ పాటలు పెద్ద హిట్ అయ్యి ఎంతోమంది ఫోన్స్ లలో రింగ్ టోన్స్ గా మారాయి.
 
- రాధే శ్యామ్ దర్శకుడితో నా జర్నీ జిల్ సినిమా నుండి సాగుతుంది.ఈ చిత్ర దర్శక నిర్మాతలు,మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ లు దగ్గరుండి నాతో పాటలు రాయించుకున్నారు.నేను రాసిన తరువాత దర్శక,నిర్మాతలు ఈ ట్యూన్ కు ఈ లిరిక్ బాగా లేదంటే చేయింజ్ చేసి మళ్లీ,మళ్లీ రాయడం జరిగింది. ఇలా వారందరూ పాటలు బాగా వచ్చే వరకు ఉండి వ్రాయించు కోవడం వల్లే ఈ రోజు ఈ సినిమాలోని సాంగ్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇందులో ఏంతో ఖర్చు పెట్టి తీసిన సాంగ్ రికార్డింగ్ అయిపోయిన పాటను స్విచ్వేషన్ తగ్గట్లులేదని తీసివేశారు.ఇందులో వచ్చే పాటలన్నీ అవసరం ఉన్న చోటే ఉంటాయి.
 
- మేము విడుదల 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా..ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా" చేసిన సాంగ్ లో కథ ఉంటుంది. ఎక్కువ కథను సీన్స్ లలో చెప్పకుండా ఒక పాటలో మాంటేజ్ లాగా చూపిద్దామని ఈ పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాట వింటుంటే అందరికీ అర్థం కాదు.ఈ సాంగ్ డిఫికల్ట్ గా ఉంటుంది. విజువల్ గా చూస్తే ఎందుకు ఇలా రాశామో అనేది అర్థమవుతుంది. 
 
- నేను చేసిన ఎన్నో సినిమాల పాటలకు ఎంతో పేరు వచ్చినా  పడిపడి లేచే మనసు లోని ఏమై పోయావే,టాక్సీవాలా లోని మాటే వినదుగా సాంగ్ కు ఎక్కువ జనాల్లోకి వెళ్లి అందరూ పాడుకునే వరకు వెళ్ళింది. ఆ ఆతరువాత వస్తున్న "రాధే శ్యామ్" లోని 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా" పాటకీ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది ఈ పాట విని నీ లిరిక్స్ బాగున్నాయని ఆఫ్రిసియేట్ చేస్తున్నారు.
 
- ఇప్పటి వరకు సుమారు 400 పాటలు పైగా రాసినా కూడా  ప్రపంచ దేశాలనుండి ఈ పాటకు  పాకిస్తాన్, జపనీస్ ఇలా ఎంతో మంది వారి భాషలో రాసి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు.ఇలా అన్ని భాషలలో తనకు ఫ్యాన్స్ వున్నారు.
 
- మొన్నటి వరకు పాన్ ఇండియా స్టార్ ఉన్న ప్రభాస్ ఇప్పడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.ఆలాంటి వ్యక్తి సినిమాకు పాటలు రాసినందుకు చాలా శాంతోషంగా ఉంది. 
 
- నేను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను.ఒక సినిమా చేసిన తరువాత వారికి నేను కంఫర్ట్ అని ఫీలైతే నెక్స్ట్ మూవీ చేస్తాను.అలా ఒకే దర్శకుడితో నాలుగు,ఐదు సినిమాలకు వర్క్ చేయడం జరుగుతుంది..
 
- ఇప్పటివరకు నా జర్నీ లో నేను చేసిన అన్ని పాటలన్నింటి కంటే ఈ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ ఎక్సపెరమెంటల్ సాంగ్. ఈ సినిమాలో 5 పాటలు రాశాను ,అలాగే నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో 4 పాటలు రాశాను.మేజర్, హిట్ 2, నాగార్జున గారి ఘోస్ట్ ఇలా చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నానని ముగించారు.