శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (17:24 IST)

చిరంజీవి ఆచార్య గురించి ఏం చెబుత‌న్నారంటే!

Acharya poster
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య‌. ఈ సినిమా గురించి ఒక్కోటి ప్ర‌చారం రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రామ్‌చ‌ర‌ణ్ ఆయ‌న శిష్యుడిగా న‌టిస్తున్నాడు. తాజాగా ఆ చిత్రంలోని ఓ పాత్ర‌ను టీజ‌ర్ లో ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్లు చిరంజీవి ట్వీట్ చేశాడు.
 
ఈ టీజర్ సిద్ద క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. “ధర్మమే సిద్ధ.. నవంబర్ 28 న ‘సిద్ధ సాగా’ని సాక్ష్యంగా చూద్దాం” అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందుతో న‌గ్జ‌లైట్‌గా చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు. ఆచార్యుడిగా అంద‌రికీ విద్య‌ను నేర్పే మెగాస్టార్‌కు ఈ చిత్రంలో పోరాటం చేయాల్సి వ‌స్తుంది. అది ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌కుడు కొరటాల శివ. ఈ చిత్రంలో కాజ‌ల్‌, పూజా హెగ్డే నాయిక‌లుగా న‌టించారు.