శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (06:39 IST)

ట్రంప్ కు కరోనాపై కిమ్ ఏమన్నారో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ స్పందించారు.

ట్రంప్‌ దంపతులు త్వ‌ర‌గా మహమ్మారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని ఆశిస్తున్నట్లు ఉత్త‌ర కొరియా మీడియా పేర్కొంది.

కాగా ట్రంప్‌, కిమ్‌ల మధ్య ఒకప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది. అయితే క‌రోనా వ‌ల్ల ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల వీరిద్ద‌రూ క‌లిసి సింగ‌పూర్‌లోని ఓ స‌మావేశానికి హాజరైన విషయం తెలిసిందే.

అయితే సమావేశంలో చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. వీరి మధ్య మాత్రం మైత్రి బ‌ల‌ప‌డింది. అందుకే గతంలో కిమ్ ఆరోగ్యంపై ట్రంప్ ట్వీట్ చేయ‌గా.. ఇవాళ ట్రంప్ ఆరోగ్యం‌పై కిమ్ స్పందించారు.