శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (09:46 IST)

ట్రంప్‌ కు సెహ్వాగ్‌ బాబా ఆశీర్వాదం

భారత్ కు చెందిన సెహ్వాగ్ బాబా ఆశీర్వాదం పంపారు. ఆ బాబా మరెవరో కాదు.. ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ బాబా ఎప్పుడయ్యాడంటారా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!

కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు, సెలెబ్రిటీలు సందేశాలు పంపుతున్నారు.

టీమిండియా మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ కూడా తనదైన శైలిలో స్పందించాడు. బాబా అవతారంలో ఉన్న ఫొటోతో..‘ట్రంప్‌ కొవిడ్‌ నుంచి కోలుకోవాలని బాబా సెహ్వాగ్‌ ఆశీర్వదిస్తున్నాడు. గో..కరొనా..గో..కరొనా గో’ అని ట్వీట్‌ చేశాడు.