ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (09:33 IST)

ట్రంప్ కు సోదర వియోగం

రెండోమారు అమెరికా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవాలనుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అన్ని విధాలా ఆయనకు అండగా వుండే ఆయన సోదరుడు స్థిరాస్థి వ్యాపారి రాబర్ట్‌ ట్రంప్‌ అనారోగ్యంతో న్యూయార్కలోని వీల్‌ కార్నెల్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాబర్ట్‌ ట్రంప్‌ మృతి విషయాన్ని ట్రంప్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. 'నా సోదరుడు చనిపోయాడన్న విషయం చెప్పడంలో నా గుండె చాలా బరువెక్కింది. ఆతను నాకు సోదరుడు మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడు కూడా. అలాంటి రాబర్ట్‌ లేకపోవడం లోటుగా ఉంది. కానీ ఆయన ఎల్లప్పడూ నా గుండెలో ఉంటారు' అని ట్రంప్‌ పేర్కొన్నారు.

72 ఏళ్ల రాబర్ట్‌ అధ్యక్షుడు ట్రంప్‌ కంటే వయసులో రెండేళ్లు చిన్న. ఆయన ఒక బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌గా ఉన్నారు.