మలయాళ నటుడు అనిల్‌ మురళీ మృతి

anil murali
ఎం| Last Updated: శుక్రవారం, 31 జులై 2020 (08:02 IST)
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ నటుడు అనిల్‌ మురళీ (56) మృతి చెందారు.
కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ హాస్పటల్‌లో కన్నుమూశారు.

బుల్లితెర నుంచి 1993లో నటుడిగా అరంగేట్రం చేసిన అనిల్‌ మురళీ దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించారు. 'కన్యాకుమారియిల్‌ ఒరు కవిత' అనేది ఆయన మొదటి చిత్రం.

మొత్తం అన్ని భాషలలో కలిపి ఆయన 200కు పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీ అయ్యారు. అనిల్‌ మురళీ మృతికి పలువురు చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :