సీనియర్‌ నేత అమర్‌సింగ్‌ మృతి

amar singh
ఎం| Last Updated: శనివారం, 1 ఆగస్టు 2020 (17:38 IST)
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, రాజ్య‌స‌భ స‌భ్యులు అమర్‌సింగ్‌ (64) మృతి చెందారు. గత కొంత కాలంగా అమర్‌సింగ్‌ అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మరణించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమర్‌సింగ్‌ 1956 జనవరి 27న అజమ్‌ఘర్‌లో జన్మించారు.

1996లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు నామినేట్‌ అయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దీనిపై మరింత చదవండి :