శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (06:33 IST)

మోదీతో జగన్ భేటీ కారణం అదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన ఖరారైంది. సరిగ్గా పది రోజుల క్రితం హస్తినలో పర్యటించిన సీఎం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల వనరుల శాఖ మంత్రి తో సమావేశమయ్యారు.

ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీతో భేటి కానున్నారు.

ఇటీవలే హోంమంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డి తాజాగా ప్రధానితో భేటి కానున్నారు.

ఈ భేటిలోనూ రాష్ట్ర ఆర్ధికంగా ఎదుర్కొంటున్న సమస్యలను, నిధుల విడుదల అవసరాన్ని చర్చించనున్నట్లు సమాచారం.