1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Kishan reddy comments on Corona virus

కరోనా.. ప్రపంచ యుద్ధం కంటే ప్రమాదకరం.. కిషన్ రెడ్డి

Corona virus
ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం కరోనాపై యుద్ధం చేయాల్సిన అవసరం వుందని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 492 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని...ప్రజలంతా తప్పకుండా ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని సూచించారు.
 
ఇటలీని కరోనా ఎలా పీడిస్తుందో గమనించాలని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అక్కడి ప్రజలంతా తొలుత బేఖాతరు చేశారని, అందుకే ఆ పరిస్థితి తలెత్తిందని అన్నారు.
 
ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారని.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశంలో ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజూ సమీక్ష జరుపుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
 
జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా కిషన్ రెడ్డి తెలియజేశారు. లాక్ డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు .చైనా మన దేశానికి సరిహద్దులో ఉన్నప్పటికీ మన దేశంలోకి ఆలస్యంగా కరోనా వైరస్ ప్రవేశించిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి వ్యక్తి స్వీయ నిర్భధం పాటించాల్సిన అవసంరం ఉందని కిషన్ రెడ్డి సూచించారు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
232 రోజుల తర్వాత గృహనిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లాకు విముక్తి