బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

హోటల్ గదిలో ప్రముఖ పాప్ సింగర్ ఆత్మహత్య

suicide
ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె పేరు హేసూ (29). సౌత్ కొరియాలోని జియోల్లబుక్ డో ప్రావిన్స్‌లోని ఓ హోటల్‌ గదిలో విగత జీవిగా పడివున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ గదికి చేరుకుని హేసూ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
వాంజుగన్‌లో మే 20వ షెడ్యూల్ అయిన గ్వాన్‌జుమియోన్ పీపుల్స్ డే ఈవెంట్‌కు ఆమె హాజరుకావాల్సివుంది. దీంతో తొలుత ఆమె హాజరుకావడం లేదని ఈవెంట్ ఆర్గనైజర్లు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించడంతో ఈ వార్త వెలుగు చూసింది. అయితే, ఈ పాప్ సింగర్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.