1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. New york times comments on India Defense

పాక్ విమానాన్ని పడగొట్టడానికి మిగ్-21 కుదేలైంది... 10 రోజుల్లో అయిపోతాయ్...

New york times
భారత భద్రతా దళాల గురించి న్యూయార్క్ టైమ్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పూర్తిస్థాయి యుద్ధం వస్తే 10 రోజుల్లో భారత ఆయుధాగారం మొత్తం ఖాళీ అయిపోతుందని ప్రస్తావించింది. పాక్, భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ పత్రిక దక్షిణాసియా స్టాఫ్‌ కరస్పాండెంట్‌ మరియా-అబీ-హబీబ్‌ ఈ కథనాన్ని వ్రాసారు. 
 
పాతకాలపు ఆయుధాలు ఈతరం యుద్ధ అవసరాలకు పనికిరావని భారత్ గమనించాలని పేర్కొన్నారు. పదాతి దళాలు, వాయు, నౌకా సేనల్లో మానవ వనరులపరంగా భారత్‌ ముందంజలో ఉన్నప్పటికీ, బలహీన స్థితిలో ఉన్న పాక్ విమానాన్ని ఎదుర్కొనే క్రమంలో మిగ్-21 కుదేలైందని చెప్పారు. 
 
భారత్ ఆయుధ సంపదలో 68% పాతవే ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి సంఘం (రక్షణ) సభ్యుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సైన్యం 21వ శతాబ్దపు యుద్ధాన్ని కూడా దశాబ్దాల క్రితం నాటి ఆయుధాలతో చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.
తర్వాతి కథనం
తండ్రి చనిపోయారు... కానీ ఆయన నిర్దోషి అని నిరూపించేందుకు పోరాడిన సంతానం...