అదృష్టదేవత నా వెనకే ఉందంటున్న గీత గోవిందం హీరోయిన్
రష్మిక అనడం కన్నా గీత గోవిందం హీరోయిన్ అంటే ఠక్కున తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టేస్తారు. ఆ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. అంతేకాదు మొదట్లో రష్మిక తెలుగులో నటించిన ఛలో సినిమా అంతగా ఆడలేదు. కానీ ఆ తరువాత నటించిన గీత గోవిందం మాత్రం యువత హృదయాలను బాగా దోచుకుంది.
దీంతో కన్నడ, తమిళ భాషల్లోను రష్మికకు ఆఫర్లు తన్నుకొచ్చాయి. తాజాగా ఆమె కన్నడలో నటించిన యజమాని సినిమా నిన్న కర్ణాటక రాష్ట్రంలో విడుదలైంది. సినిమా భారీ విజయంతో ముందుకు దూసుకువెళుతోంది. దీంతో రష్మిక ఆనందానికి అవధుల్లేకుండా పోయిందట.
అదృష్ట దేవత తన వెనుకే ఉందంటూ స్నేహితులతో చెప్పి తెగ సంతోషపడిపోతోందట. అంతేకాదు మరో వారంరోజుల్లో తమిళంలో ఒక సినిమాలో తెలుగులో మరో సినిమాలో నటించనుందట రష్మిక. మరి... చూడాలి రష్మిక క్రేజ్ ఇలాగే కొనసాగుతుందో లేదో.