నా లైఫ్‌లో ఆయన ఉండాలి... ఓవియా సంచలన వ్యాఖ్యలు
తమిళ బిగ్‌బాస్ షోలో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఓవియా ప్రస్తుతం 90 ఎమ్ఎల్ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అనేక బోల్డ్ సన్నివేశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు రాగా ఈ విషయంలో అభిమానులు సైతం కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు ఓవియా. ఈ సందర్భంగా ఓవియా తన వ్యక్తిగత విషయాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బిగ్ బాస్ షో నడుస్తున్న సమయంలో ఓవియాకు హీరో శింబు మద్దతు లభించింది. ఇక సినిమాలు, పాటలతో కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు, దీంతో వీరి మధ్య అపైర్ ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఓవియా తామిద్దరి మధ్య ఉండేది ప్రేమ కాదని, కేవలం స్నేహమని తేల్చి చెప్పింది.
ఇంకా ‘స్నేహానికి, ప్రేమకు తేడా ఉంది, శింబు నాకు చాలా మంచి స్నేహితుడు, నా వ్యక్తిగత విషయాలను అతనితో షేర్ చేసుకుంటాను, నా సమస్యలపై అతని నుండి సలహాలు తీస్కుంటాను..అంతేకాకుండా ఏ సమయంలోనైనా అతనికి కాల్ చేయగల చనువు మా మధ్య ఉంది, శింబుకు అవతలివారి కష్టసుఖాలను అర్థం చేస్కుని తోడుగా నిలిచే మంచి మనసు ఉందని, ఇక నా జీవితంలో శింబు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది ఓవియా.