పవన్ కల్యాణ్ 'నా ఎందపరందు అంద చాట'.. ఆ పార్టీ ఖాయమంటున్న అలీ
రాజకీయాలపై దోబూచులాడుతూ వచ్చిన సినీ నటుడు అలీ తన మనస్సులోని మాటను బయట పెట్టేశాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన పెట్టిన పార్టీలో చేరుతానని స్పష్టం చేసారు. రెండు రోజుల క్రితం చంద్రబాబుకి ఇదే విషయాన్ని తాను చెప్పానన్నారు. ఆయన ఎంతో సంతోషపడ్డారని అలీ గుంటూరులో తెలిపారు.
అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ప్రజలు రాజకీయ నాయకుడిగా నన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు ఆలీ. పవన్ కల్యాణ్ పైన పోటీ చేయమంటే అని ఓ వ్యక్తి అడుగ్గా... ఆయన నా ఎందపరందు అంద చాట అంటూ అర్థం కాకుండా డైలాగులు కొట్టేశారు.